చరిత్రకెక్కిన.. చెన్నూరు

Sunday, 13 Dec, 1.27 am

'చెన్నూర్‌'.. పేరు వినిపించగానే మొదట గుర్తుకు వచ్చేది పంచక్రోశ ఉత్తర వాహిని.. గోదావరి. ఆ తర్వాత అంబా అగస్త్యేశ్వరాలయం (శివాలయం), అందులో నాలుగు శతాబ్దాలుగా వెలుగుతున్న అఖండజ్యోతి. మరో పూరీ క్షేత్రంగా కీర్తికెక్కిన జగన్నాథాలయం, పెద్ద చెరువులో నెలకొన్న అగస్త్య గుండం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను ఇముడ్చుకున్న చెన్నూర్‌ దక్షిణ కాశిగా ప్రఖ్యాతిగాంచిన పట్టణం.

ఆధ్యాత్మికంగా తెలంగాణలో గోదావరి నది ఎంతో విశిష్టమైంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే గోదారమ్మ చెంతన ఎన్నో అద్భుత పట్టణాలు పురుడుపోసుకున్నాయి. వాటిలో ఒకటి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌.