యువకుడిని కిడ్నాప్ చేసి కుమ్మేశారు..

Monday, 01 Mar, 1.57 am

హైదరాబాద్: కుషాయిగూడలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కర్రలతో దాడి చేశారు. తీవ్ర చిత్ర హింసలు పెట్టారు. అలా చిత్ర హింసలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.