టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు: రాజయ్య

Monday, 01 Mar, 1.46 am

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకూ ఇదే వర్తిస్తుందని రాజయ్య అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసినా ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని చెప్పారు. ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా ఇలాగే కామెంట్స్ చేశారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. ఓటమి భయం పట్టుకునందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. సభ్యత్వ నమోదుకు ఆదరణ కరువు కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిందని ఎద్దేవా చేస్తున్నారు.