ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా: గౌరి సతీష్

Monday, 01 Mar, 12.27 am

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగం కుదేలైందని మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. జోన్‌ల సమస్యను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడంలేదని ఆయన ప్రశ్నించారు. తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి చట్టసభల్లో ఉంటే ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందని, సేవే లక్ష్యంగా పని చేస్తానని గౌరి సతీష్ స్పష్టం చేశారు.