పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి : తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్

Monday, 01 Mar, 2.03 am

హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పట్ల అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

పీఆర్సీ ఫిట్మెంట్ 1. 45% చొప్పున 2018 జులై ఒకటి నుంచి వర్తింప.జేస్తూ బకాయిలను చెల్లించాలని సంఘం డిమాండ్ చేసింది. సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ క్రమంలో... రాష్ట్ర ప్రభుత్వమే సీపీఎస్ ను వెంటనే రద్దు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణ రాష్ట్రానికి బేషరతుగా తీసుకురావాలని, ఉపాధ్యాయుల యూనిఫైడ్ సర్వీసెస్ ను ఆమోదించి అమలు పరచాలని సంఘం డిమాండ్ చేసింది.