నరసింహకు అండగా ఉంటాం.. ఉద్వేగానికి గురైన బండి సంజయ్

Monday, 01 Mar, 12.42 am

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాన్సువాడ చిన్నోడు నరసింహ సందడి చేశాడు. బాన్సువాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ప్రసంగాలకు ఉద్వేగభరితంగా స్పందించిన నరసింహా.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. తన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ సంజయ్... ఆ బాలుడిని ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహకు కొత్త బట్టలు పెట్టి.. కలిసి భోజనం చేశారు. బాలుడి పేదరికం గురించి తెలుసుకుని సంజయ్ ఉద్వేగానికి గురయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మెదటి డబుల్ బెడ్రూం నరసింహ కుటుంబానికే కేటాయిస్తామన్నారు. బాన్సువాడలో నరసింహ కుటుంబం ఉండే ఇంటి అద్దె ఇకపై బీజేపీ చెల్లిస్తుందని ప్రకటించారు.