ముఖ్య అధికారులతో భేటీ కానున్న ఏపీ ఎస్ఈసీ

Sunday, 28 Feb, 9.26 pm

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆదివారం విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం 3:30 గంటలకు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు గుర్తింపు కలిగిన, రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 7 గంటల నుంచి 7:15 వరకు వారి నుండి సూచనలు, సలహాలు తీసుకుంటారు. కాగా అధికారులతో జరగనున్న ఈ సన్నాహక సమావేశానికి ఎస్‌ఈసీ కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.