మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు షర్మిలను ఉద్దేశించే చేశారా..!?

Sunday, 28 Feb, 11.22 pm

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొందరు వేరే పార్టీ పెట్టాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమాలకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు పార్టీ పెట్టాలని చూస్తున్నారు కానీ వేరే పార్టీలకు మాత్రం అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు తమ పార్టీగా భావిస్తారన్నారు. టీఆర్ఎస్‌ను ఎప్పటికీ ప్రజలు ఆదరిస్తారన్నారు. సీఎం కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు.

ఎవర్ని ఉద్దేశించి..!?

కాగా.. మంత్రి 'కొందరు' అని వ్యాఖ్యానించింది ఎవర్ని ఉద్దేశించి అనేది తెలియరాలేదు.