ఇస్రోకు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

Monday, 01 Mar, 12.37 am

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్వీ-సి51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈభారీ ప్రైవేట్‌ వాణిజ్య ప్రయోగంతో ఇస్రో ప్రపంచంలోని అగ్ర శ్రేణి అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో ఒకటని మరోసారి నిరూపితమైందని సీఎం అన్నారు. పలుదేశాలు తమ సాంకేతిక అవసరాల కోసం ఇస్రోను ఎంచుకోవడం ద్వారా మన దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నదని ఆయన అన్నారు. ఈప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.